Monday, August 31, 2009

పిల్ల కష్టాలు

నాకు నా చిన్నప్పట్నుండీ చిన్నపిల్లలతో పడేది కాదు. ఆ ఏజ్ లోనే నా ఏజ్ పిల్లల్తో ఫాక్షన్ గొడవలూ గట్రా జరుగుతూ ఉండేవి. ఐతే అప్పటి బ్యాచ్ లో ఉన్న చిన్నపిల్లలంతా పెరిగి పెద్దయ్యే క్రమంలో ఆ ఏజ్ ని బట్టి స్కూల్లో నైతే పిల్లల్తోనీ , కాలేజ్లో నైతే మిగతా స్టూడెంట్స్ తోనీ గొడవలు పెట్టుకుంటూ...మరీ పెద్దయ్యి జీవితంలో స్తిరపడ్డాకా ఎవడుపడితే వాడితోనీ గొడవలుపెట్టుకుంటూ బ్రతుకుతున్నారు.

ఆదేంటో
నా విషయంలో మాత్రం ఇంత పెద్దయ్యాక కూడా ఎటువంటి మార్పూ లేదు... ఇప్పటికీ చిన్నపిల్లల్తో గొడవలు జరుగుతూనే వున్నాయ్.....నా మానాన నేను బ్రతుకుతున్నా ఇప్పటికీ ఇంట్లోనో...వీదిలోనో ఎవడో ఒక పిల్ల కుంక తో పోరాటం తప్పటంలేదు... :-(

నాకో మేనల్లుడున్నాడు .....పేరు పవన్ కుమార్ ...సార్ధక నామదేయుడు.... గెరిల్లా యుద్దతంత్రం లో అందేవేసిన చెయ్యి...అంటే మనం టీనో కాఫీనో మూతి దగ్గరపెట్టుకుని వూదుకుని తాగేప్పుడు మనల్ని తోసేసి పారిపోవటం, మనం ఫోన్ లో ఎవరితోనైనా సీరియస్ గా మాట్లాడుతున్నప్పుడు ఏ తొడ మీదో గట్టిగా గిచ్చి పారిపోవటం ఇత్యాది రకాల ఈవెంట్స్ లో మనోడిని కోట్టేవోడే లేడు.
పువ్వు పుట్టగానే పరిమళించినట్టు, గేదె పుట్టగానే గడ్డి మేసినట్టు.....వీడు పుట్టిన మూడేళ్ళకే ఉగ్రవాదిగా మారి కనిపించిన ప్రతీవోడినీ పీక్కు తినేస్తుంటే భరించలేక మా అక్క వాళ్ళు వీడిని మా ఇంట్లో పడేసి పోయారు....వీడికీ నాకూ మద్య పచ్చగడ్డే కాదు పచ్చి సెనగపప్పు వేసినా భగ్గు మంటుంది...కానీ ప్రతీసారీ నాకే కాలుతుంది. :-(


వీడి మిగతా టాలెంట్స్ సంగతేమోకానీ, అందరినీ గిచ్చటం అనే టాలెంట్ మాత్రం నా చలవేనేమో అని నాకో పేద్ద డౌటు....

వీడికి 1 సంవత్సరం వయసున్నప్పుడు నేను వీళ్ళింటిలోనే ఉండేవాడిని.....వీడిని 24 గంటలూ ఎవడోకడు ఎత్తుకునితిప్పాలి.....నేను సాయత్రం ఆఫీసు నుంచి రావడం పాపం... వీడిని నా మీదకి తోలేసేవోరు...రెండు చేతులూ మార్చుకున్తూ వీడిని మోసేసరికి ఒక వారానికి నా రెండు భుజాలు మాంచి కండలు తిరిగి మిగతా బాడీ మాత్రం సన్నగా అలానే ఉండిపోయింది....మొత్తానికి 'పాపాయ్' లాగా తయారయ్యాను.

ఈహ ఇలాక్కాదు అని చెప్పి...రోజూ ఒక పావుంగంట మొయ్యటం..తర్వాత ఎవరూ చూడకుండా వాడి పిర్ర మీద చిన్నగా గిల్లేవాణ్ణి ....వీడు "'కేర్ర్ర్ర్ర్ర్ర్....." మనేవాడు ......అరెరే వీడు నా దగ్గరుండటంలేదు...అని మా అక్కకిచ్చేసేవోణ్ణి.... :-)


ప్లాను వర్కవుట్ అయ్యింది..... అలా కొంత కాలం హ్యాపీ గానే గడిచింది...ఈలోగా మా వాడు కొంత లోకజ్ఞానం సంపాయించినట్టున్నాడు...నేను చిన్నగా గిల్లగానే గిల్లిన చోట చేత్తో పట్టుకుని "క్కే....ర్ర్ర్ర్ర్ర్" అని రాగం మొదలెట్టి ఎవరో ఒకరొచ్చి చూసేవరకు ఆపేవాడు కాదు.......ఎందుకొచ్చినగొడవరా బాబూ దొరికిపోయేట్టున్నాను అని చచ్చినట్టు గంట మోసేవాణ్ణి ....

తర్వాత్తర్వాత వీడు తెలివి వయసుకన్నా ముదిరిపోయి.... నేను ఇంట్లోకి రావడం పాపం "క్కేర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్
ర్ర్ర్ " మని అరుస్తూ ఏ కాలో చెయ్యో చూపించడం మొదలెట్టి నన్ను భయపెట్టేవోడు..... అలా భయపెట్టీ భయపెట్టీ బాగా అరితేరిపోయి ఇప్పుడు నన్ను రోజుకి ఓ ముప్పయి సార్లు గిల్లి ముక్కలు తీసేస్తున్నాడు.

వినాయకచవితికదానీ....మా అమ్మ వీడిని తీసుకుని గుడికెల్లింది....ఇల్లంతా ప్రశాంతంగా ఉంది....


తీరిగ్గా
కూర్చొని స్వాతిలో వారఫలాలు చూస్తున్నాను..... తులా రాసిలో "అనుకోని కలహాలు ఎదురవును...జాగ్రత్తతో వ్యవరించవలెను " అని రాసుంది. వెంటనే నా ఎడమకన్ను టపటపా కొట్టుకుంది .....వాకిట్లో మా అక్క ఫ్రెండూ, తన నాలుగేళ్ళ కొడుకు ప్రత్యక్షమయ్యారు......ఆకాశవాణి ఎంటర్ ద డ్రాగన్ అని అరిచింది.వీణ్ణి చూస్తే కొద్దిగా తేడాగా కనిపించాడు.... మావాడితో నాకు బాగా ఎక్స్పీరియన్స్ కాబాట్టి ఇలాంటి కేసుల్ని ఈజీ గా కనిపెట్టేస్తా....... అయినా ఎందుకైనా మంచిదని కామ్ గా కూర్చున్నా..

వాడు వచ్చీ రావడంతోనే "అమ్మా... ఇది నాదీ" అని దీర్ఘం తీస్తూ నా చేతుల్లోంచి స్వాతి లాగేసుకుని యుద్దానికి సమర శంఖం మోగించాడు. టీపాయ్ మీదున్న నా సెల్ ఫోన్ తీసి ఏదో నంబర్లు అలా తిరగేస్తున్నాను.....అంతే


"అమ్మా....ఇది నాదీ " ......


నిశ్శబ్ధంగా వాడివంక చూసి రిమోట్ తీసుకుని టీవీ ఆన్ చేసాను...తల తిప్పకుండా వాడి వంక ఓరకంట చూసాను....వాడూ నా వైపు అలానే చూస్తున్నాడు. ఒక్క నిమిషం ఆగి.. రిమోట్ లాక్కొని "అమ్మా.... నేను పోగో చానెల్ చూతా " అని చానెల్స్ నొక్కడం మొదలెట్టాడు...


వచ్చిన
మూడొ క్షణంలోనే నా మూడు ఐటంస్ లాగేసుకున్నాడు....... నాకు బీపీ పెరిగిపోయింది...నా చిన్నప్పటి గతం గుర్తుకొచ్చింది నాలోని పిల్ల సిమ్హారెడ్డి బయటకొచ్చాడు.. విసురుగా రిమోట్ లాక్కున్నా ..... వాడు ఒక్క క్షణం గాల్లోకి చూసి తర్వాత కింద కూర్చుని కాళ్ళు బార జాపుకుని తల పైకెత్తి నోరు పెద్దది చేసుకుని "వ్వ్వ్వ్వాఆ.........." అంటూ రాగం మొదలెట్టాడు....అంతే నాలుగు సుఖోయ్ ఫైటర్ జెట్ లు మా ఇంటి వరండాలోంచి టేక్ ఆఫ్ అయినట్టు పేద్ద సౌండ్ లాంటి కూత మొదలయ్యింది... వీడి రాగం విని వాళ్ళమ్మ పరిగెట్టుకొచ్చింది....నేను ముందు జాగ్రత్తగా రిమోట్ వాడి చేతిలో పెట్టేసాను....వాళ్ళమ్మ ఏవయ్యిందిరా ...అనేలోపే వీడు చెయ్యి నిటారుగా లేపి నా వైపు పాయింట్ చేసి 'వ్వ్వ్వాఆ " అంటూ రాగం ఏమాత్రం చెడకుండా శ్రుతి కొంచెం పెద్దది చేసాడు.


అడ్డంగా బుక్ చేసేసాడు....తక్షణం కవరింగ్ ఇచ్చుకోవాల్సిన పరిస్తితి. ..
" అబ్బే ఏం లేదండీ పోగో చూస్తానన్నాడు....చానెల్ పెట్టుకోడం రాక ...నేను పెడతానంటే" ఏడుస్తున్నాడు....
హి హి హీ అని తెచ్చిపెట్టుకున్న నవ్వొకటి ఆవిడ కిచ్చాను.


పోగో అంటే ప్రాణం వెదవకి అది తప్పితే ఇంకోటి చూడడు వెధవ....అని మురిసిపోయింది వాళ్ళమ్మ.....వాడితో ఏడవకూడదు నాన్నా నీకు తెలీపోతే అంకుల్ ని అడిగి పెట్టించుకోవాలి....అని రిమోట్ నాకిచ్చి తిరిగి రూంలో కి వెళ్ళిపోయింది.....

పిల్లకుంక విజయ గర్వంతో కళ్ళు తుడుచుకుని..... చూసావా నీ కన్నుతో నిన్నే పొడిచా....మర్యాదగా పోగో పెట్టు .. అన్నట్టు చూసాడు.

ఇంక ఈ పిల్ల రాక్షసుడితో పడే కన్న బయటకు ఎక్కడికోచోటకి పోవడం బెటర్ అని డిసైడయ్యి ...లోపలికెళ్ళి రెడీ అయ్యి హాల్ లోకి వచ్చి షూస్ వేసుకుంటూ వాడి వంక చూసా.......వాడు ఈ సారి నేను దేన్ని పట్టుకుంటానా ...దాన్ని ఎప్పుడు లాగేసుకుందామా అని చాలా కాన్సంట్రేషన్ తో నన్నే అబ్జర్వ్ చేస్తున్నాడు.... నేను ఓ నవ్వు నవ్వి " నే బయటకెళుతున్నా " అని మా అక్కకి వినపడేలా ఒక కేక వేసి టేబుల్ మీదున్న నా బైక్ కీస్ తీసుకుందామని లేచా......
అప్పుడు తెలిసింది వీడి బ్రైన్ సూపెర్ కంప్యూటర్ కి ముత్తాత అని. ....వాడు టప్పున లేచి చెంగున గెంతి నిమిషంలో వందో వంతులో నా బైక్ కీస్ తీసుకుని ..... " అమ్మా ...ఇది నాదీ " అన్నాడు....


నా మీద నాకే జాలి, కోపం, ఆగ్రహం, ఆవేశం, అంకుశం,...ఆహుతి కలిగాయి...అయినా తమాయించుకుని
" కళ్ళు ఎర్రగా చేసి ....వాడి వంక చూస్తూ....పైకి మాత్రం " కీస్ ఇచ్చేయమ్మా ఆచ్ వెళ్ళాలి " అన్నా.....

" ఆ ఇది నాదీ ...." అని ఈసారి తాళం గుత్తిని గట్టి ఇంకా గట్టిగా బిగించి పట్టుకున్నాడు....

ఈదెబ్బతో
నాకు మసాలా నషాలానికి అంటింది .....వాడి దగ్గిరికెళ్ళి మొహమంతా కోపం చేసుకుని "కధకలి" డ్యాన్స్ లో మొహం లో ఎన్ని ఎక్స్ ప్రెషన్స్ ఇస్తారో అన్నీ చూపించి ...కీస్ ఇవ్వరా అన్నా.....సీను రిపీట్ అయ్యింది.. ఈసారి వాడు 10 సుకోయ్ , 15 మిరేజ్ ఫైటర్ జెట్స్ ని రంగంలోకి దించాడు........వాళ్ళమ్మ పరిగెట్టుకొచ్చింది ....ఈ సారి చాన్స్ మాత్రం వాడికివ్వకుండా నేను నా చెయ్యి నిటారుగా పైకి లేపి వాడి వైపు పాయింట్ చేసి " నా బైక్ కీస్ ....నేను బయటకెళ్ళాలి " అని చెప్పా.

వాళ్ళమ్మ వెంటనే వాడి దగ్గరనుంచి ఏదైనా వెనక్కి తీసుకోవాలంటే ఒక మంత్రం ఉందని దాన్ని నాకు ఉపదేశిస్తానని చెప్పి నాదగ్గరకొచ్చి నా చెవిలో "ఆ మంత్రం పేరు - క్యాచ్ " అంది.

"క్యాచ్ చేయలేకపోయాను.... కాస్త సరిగ్గా చెప్పండి " అన్నా....

వాడి చేతిలో వున్నదేదైనా మనం ఇమ్మంటే ఇవ్వడు.......అదే "క్యాచ్" అన్నామనుకో వెంటనే మనమీదకి విసిరేస్తాడు.. అని చెప్పింది.

పోన్లే ఏదో ఒహటి అని వెంటనే ..నేను వాడివైపు తిరిగి "క్యాచ్ " అని అరిచా...... వాడు వెంటనే మొహమంతా 100 వాట్స్ బల్బు లాగా పెట్టి కీస్ నా మీదకి కాకుండా గుమ్మలోంచి బయటికి విసిరేసాడు......

'ఒరేయ్...^%&$^%$&%*"


ప్రతీరోజులాగే ఈరోజుకూడా ఓ పిల్లకుంక చేతిలో ఓడిపోయా ....
నేను కీస్ వెతుక్కుంటూ అస్తమిస్తున్న సూర్యుడివైపు నడుచుకుంటూ వెళ్ళిపోయా....

31 comments:

అశోక్ చౌదరి said...

ha ha ha..

Anonymous said...

:-)))

నేస్తం said...

చాలా చాలా బాగా రాసారు :) బాగా నవ్వొచ్చింది ..
" "అబ్బే ఏం లేదండీ పోగో చూస్తానన్నాడు....చానెల్ పెట్టుకోడం రాక ...నేను పెడతానంటే ఏడుస్తున్నాడు ..."
అక్కా అంటున్నారు మళ్ళీ అండీ అంటున్నారు .. :)

Indian Minerva said...

"నేను కీస్ వెతుక్కుంటూ అస్తమిస్తున్న సూర్యుడివైపు నడుచుకుంటూ వెళ్ళిపోయా...."
అదేదో షాడొ నవల్లోలాగా....

బాగున్నాయండీ మీ పిల్ల సాహసాలు.

Indian Minerva said...
This comment has been removed by the author.
భావన said...

అబ్బ నవ్వి నవ్వి నా వల్ల కాదు బాబోయ్.. పొద్దుట అనవసరం గా ఆఫీస్ టైం లో మొదలు పెట్టేను చదవటం. బాబోయ్ నా మూతి ముక్కు అంతా ఎర్ర బడి పోయి నొప్పి కూడా వేస్తోంది నవ్వు ఆపి ఆపి. అబ్బ ఇంత నవ్వి ఎన్నాళ్ళు అయ్యిందో..

మేధ said...

>>నేను కీస్ వెతుక్కుంటూ అస్తమిస్తున్న సూర్యుడివైపు నడుచుకుంటూ వెళ్ళిపోయా....
ప్చ్.. :))

సుజాత వేల్పూరి said...

:-))

Anonymous said...

నేస్తం గారు, అండీ అన్నది రిషి గారి అక్కయ్య గారి ఫ్రెండ్ ని అన్న మాట, ఇది చూడండి "వాకిట్లో మా అక్క ఫ్రెండూ, తన నాలుగేళ్ళ కొడుకు ప్రత్యక్షమయ్యారు."

sunita said...

హ.హ.హ. .చాలా బాగుంది.చాలా రోజుల తరువాత మంచి కామెడీ టపాలు కనపడుతున్నాయ్

లలితప్రియదర్శిని said...

రిషి గారు,
నవ్వించి, నవ్వించి చంపేశారు ! నవ్వలేక చచ్చి,మళ్ళీ చావలేక నవ్వి, ఈ నవ్వులతో చచ్చే చావోచ్చిందండీ బాబు ! నాకు మెంటలేమో అని అందరూ ఫిక్స్ ఐపోయుంటారు, ఇలా కంప్యూటర్ని చూస్తూ నవ్వుకుంటుంటే పని సమయంలో !

నాకూ మీలానే ఈ పిల్ల కష్టాలు అతిగా ఉంటూ ఉండేవి.పిల్లలోస్తే చాలు, కుడి కన్ను టప టపా కొట్టుకునేది.ఈ విషయాన్నీ ఇంత సరదాగా చెప్పొచ్చని ఇప్పుడే తెలిసింది ! :-)

GIREESH K. said...

:))

శ్రీవిద్య said...

చాలా చాలా చాలా బాగుంది :) :)

మధు said...

hhaaahaa !!!

మాకు నవ్వుల్ని పండించటానికి ప్రతీ రోజూ మీకు ఇలాంటి పిల్ల కష్టాలు ఎదురవ్వాలి అని కోరుకుంటున్నాను ;-)

శేఖర్ పెద్దగోపు said...

:))
బాగుంది రిషి గారు...చాలా నేచురల్ గా ఉంది కామెడీ...
కానీ నాకెందుకో మీ స్థాయితగ్గ కామెడీ పండించలేదనిపించింది. బహుశా ఇలాంటి కాన్సెప్ట్ లో కామెడీ పండించటం కష్టమేమో!!!
మొత్తానికి సుదీర్ఘవిరామం తర్వాత మమ్మల్ని ఎంటర్టైన్ చేశారు. నెనర్లు.

నేస్తం said...

అఙ్ఞాత గారు :) అర్ధం అయ్యింది.. మార్నింగ్ అటు వంట చేస్తూ ఇటు ఈ పోస్ట్ చదివేయాలన్నా ఆశ కొద్ది కంగారులో ఆ లైన్ మిస్ అయ్యానన్నమాట :) థేంక్స్ అండి

కొత్త పాళీ said...

good one

KK said...

Hillarious !!

Aswin Budaraju said...

Cool Undi Super

Anonymous said...

కాదేది కామెడీకి అనర్హం అని నిరూపించారు. Very funny. "పువ్వు పుట్టగానే పరిమళించినట్టు, గేదె పుట్టగానే గడ్డి మేసినట్టు" ప్రయోగం భలేగా ఉంది.

మీ నేస్తం said...

చాలా బగుంది నవ్వలేక కదుపులో నరాలు పట్టెశాయి

Ram Krish Reddy Kotla said...

Rishi garu...iragadeesaru..anaadi nunchi ilanti pilla rakshasulatho pratiokkaru edoka samaram edurukuntune unnaru :)

Ram Krish Reddy Kotla said...

Rishi, me blog lo anni posts ekabigina chadivesa...super...

Ram Krish Reddy Kotla said...
This comment has been removed by the author.
oremuna said...

Kindly send a mail to chavakiran @ gmail . com

మోహన said...

:)

Viswanath said...

idhe first time mee blog choodadam super unnaayi mee pilla kashtaalu...

Migathaa posts annikuda chadhivedham ani decide ayipoya...

uma said...

oh pleaseeeeeeee, pleaseeeeeeee write another post. Very eagerly waiting for your posts, and it's been a very long time we could read one of your articles.

Pleaseeeeeeeeeee do keep writing ! ;-)

P.S: I dunno how to plead others, but I had no option but to try pleading, being an ardent fan of your blog !

Anonymous said...

rendu rellu aaru tarvata mallee aa range lo navvukunna blog idenandee

కొత్తావకాయ said...

కేవలం ప్రాస కోసం వాడినా 'గేదె పుట్టగానే గడ్డి మేసినట్టు 'ప్రయోగం బాగుంది.
హహ్హహ్హా.. ఈ చెగోడీ కూడా కరకరలాడింది. మళ్ళీ కొత్త పోస్టు ఎప్పుడో?

Anonymous said...

Hi..

miru blog close chesara ?
rayatam manesara ?

epudu comments ku reply ichinattu leru..