Tuesday, September 9, 2008

రాంబాబు-రాజ్యం

వాతావరణం లో పెద్ధగా మార్పులు ఏమీ ఉండవు.....తెలంగాణ కోస్తాలలో అక్కడక్కడ జల్లులు పడే అవకాశం ఉంది. ఇక రాష్త్రం లోని నాలుగు ప్రదాన నగరాలలో ఈ రోజు నమోదైన...........

తెల్లవారుజామున దుప్పటి ముసుగుతన్ని మాంచి నిధ్రలో ఉన్న రాంబాబు ఉలిక్కి పడ్డాడు ....ఇంత పొద్దున్నే టీవీ పెట్టుకుని వెథర్ న్యూస్ చూస్తున్న గాడిద ఎవరబ్బా అనుకుంటూ ముసుగులోంచి తల బయటకి పెట్టి చిరాగ్గా బుర్ర గోక్కున్నాడు ...

'తిరుపతి గరిష్టం 32.5 కనిష్టం 19.4 విశాకపట్నం 30.1 22.3...........'

మరింత దగ్గరగా వినపడింది........ఒక్కసారిగా పిడుగు నెత్తిమీద పడ్డట్టు కొయ్యబారి పొయాడు రాంబాబు, ఒంట్లో ఉన్న రక్తం ఎవరో స్ట్రా పెట్టి పీల్చినట్టుగా ఉంది... చీకట్లొ గొంతు వినపడుతున్న వైపు బేలగా చూసాడు...
రాంబాబు బార్య రాజ్యం నిద్రలోనే టీవీ9 లో న్యూస్ రీడర్ లాగ చకా చకా వెథర్ న్యూస్ చదువుతూ ఉంది.

'ఇవీ ఈరోజు వాతావరణ .......'

దీని దుంపతెగ మళ్ళీ దీనికి ఆ దిక్కుమాలిన కలవరింతల జబ్బు థిరగదోడింది......బెడ్ లైటు వేద్దామని విసురుగా లేచి చీకట్లో కనపడక పక్కనున్న ట్రంకుపెట్టికి మోకాలు తగలటంతో ప్రాణం పోయినట్టయ్యింది రాంబాబుకి.

'......చూస్తునే ఉండండి టీవీ 9...' చెప్పుకుపోతూఉంది రాజ్యం..

అరికాలి మంట నెత్తికెక్కింది రాంబాబుకి ....చీకట్లో ఎలాగో కుంటుకుంటూ వెల్లి లైటు వేసాడు...అయిదేళ్ళ బాబి గాడు దుప్పట్లోంచి బుర్ర కొద్ధిగా బయటకుపెట్టి రాజ్యం వంకా రాంబాబు వంకా భయం భయం గా చూస్తున్నాడు.....లైఫ్ లో ఫస్ట్ టైం జీవితం మీద విరక్తి కలిగింది రాంబాబుకి.

' టీవీ9 లో న్యూస్ రీడర్ కి బ్రేక్ దొరికినట్టు సైలెంటు గా ఉంది రాజ్యం'.

విసురుగా వెళ్ళి ఫ్రిజ్ లోంచి వాటర్ బాటిలు తీసుకువచ్చి నీళ్ళు గుప్పెట్ట్లోకి వంచుకుని రాజ్యం మొహం మీద కొట్టాడు. దెబ్బకి స్ప్రుహలోకి వచ్చింది రాజ్యం ...ఎదురుగా నుంచున్న బర్తని...మంచం మీద ఒక మూలగా కూర్చున్న బాబి గాడిని చూసి...ఇంత రాత్రి పూట మొహం మీద నీళ్ళు కొట్టి మరీ లేపారేమిటబ్బా అనుకుని...
ఏంటండీ...పీడకల ఏమైనా వచ్చిందా .....మొహం అలా పెట్టారు, ఏరా బాబిగా నాన్నారిని చూసి జదుచుకున్నావా నాన్నా....పిచ్చి వెధవా...వెధవికి అన్నీ భయాలే ....

పిచ్చెక్కి నట్టు చూసాడు బాబి రాంబాబు వంక.

పీడకలా నీ బొందా...నువ్వే నిద్దర్లో పిచ్చి పిచ్చి గా మాట్లాడుతుంటె హడలిపోయి వెళ్ళి మంచం మీద ఒక మూల కుచ్చుని పిచ్హి చూపులు చూస్తున్నాదు.అయినా నీకిదేం పొయేకాలమే ....ఎవరైనా పిల్లల గురించో లేకపోతే దగ్గర వాళ్ళ గురించో బెంగ పెట్టుకుని నిద్ద్దర్లో కలవరిస్తారు ....అది కూదా ఒక ముక్క...లేక పొతే ఒక లైను. నువ్వేంటే ....వార్థలకి వార్తలు చదివేస్తున్నావ్...' తల గోడకేసి బాదుకున్నాడు రాంబాబు.

ఒక్కసారిగా పరిస్తితి అర్దమై బావురుమంది రాజ్యం.'నా దరిద్రపు జబ్బు వల్ల మిమ్మల్ని బాబి గాడ్ని ఇంత బాధ పెదుతున్నాను...దీనికనా ఏ నుయ్యో గొయ్యో చూసుకునుంటే బాగున్ను రా దెవుడోయ్ ....సన్నగ ట్యూన్ మొదలుపెట్టి బాబి గాడిని దగ్గరకి తీసుకోవటానికి ట్రై చేసింది రాజ్యం, చెంగుమని దూకి రాంబాబు వెనకాల దాక్కున్నాడు బాబి గాడు.
చూసావా రాజ్యం .....నా సంగతి వదిలెయ్ ...వాడు చూడు నిన్ను చూసేసరికి బయపడి పారిపోతున్నాడు...నా మాట విని ఆ వెధవ టీవీ చూడ్డం మానెయ్, ఆ రోజు డాక్టరు గారు కూడా అదే చెప్పారు గుర్తుందా....టీవీ చూడ్డం మానెయ్ మని......
సడన్ గా ఏదో గుర్తుకు వచ్చినట్టు ఆగి....అయినా మనింట్లో కేబుల్ టీవీ తీయించేసాను కదా ....అని రాజ్యం వంక చూసాడు ప్రస్నార్దకంగా..
ఏదొ క్లూ దొరికినట్టు వెలిగింది రాజ్యం మొహం ...అంతలోనే బాదగా రాంబాబు వంక చూసి..'ఈ రోజు వరలక్ష్మి వ్రతం కదా పక్కింటి పిన్ని గారు పేరంటానికని పిలిస్తే వెళ్ళాను ....పూజ ఇంకా అవ్వలేదు 10 నిమిషాలు కూర్చో అమ్మాయ్ అంటే...కూర్చిని టీవీ లొ వార్తలు వస్తుంటే .....నసిగింది....రాజ్యం.
విషయం అర్దమయ్యింది రాంబాబుకి....భార్య మీద జాలేసింది ....సరేలే నువ్వు పడుకో...పొద్దున్న మాట్లాడదాం అని బాబి గాడిని బుజమ్మీద వేసుకున్నాడు.

పడుకున్నాడు గాని నిద్ర రావటం లేదు రాంబాబుకి..ఏదో ఒకటి చేసి ఈ సమస్యకి ఒక పరిష్కారం కనుక్కోవాలి...నిజానికి రాజ్యానికి ఈ ప్రొబ్లం ఒక సంవత్సరం నుంచి మొదలయ్యింది .....బహుసా ఒక్క సంవత్సరం లొ పుట్టుకొచ్చిన లెక్కలేనన్ని టీవీ చానెల్స్ వళ్ళ కూడా కావచ్చు...అందుకనే ఇంట్లో టీవీ కూడా తీయెంచేసాడు ....టీవీ చూడనంతకాలం బాగానే ఉంటుంది రాజ్యం...అలాగని చుట్టుపక్కల వాళ్ళ ఇంటికి వెళ్ళటం కూదా తగ్గించింది కూడా...అయినా ఎప్పుదో ఒక సారి ఇలా విధి ఆడుతున్న వింతనాటకంలొ రాజ్యం దొరికిపోయి తాను బలయ్యిపోతున్నాడు.

10 రోజుల క్రితం జరిగిన సంగటన గుర్తుకొచ్చింది రాంబాబుకి...తమ్ముడి కూతురి ఫంక్షన్ కి పుట్టింటికి బయలదేరింది రాజ్యం, ఆ వూర్లొ కేబుల్ టీవీలు సినిమా హాల్సూ గట్రా లేకపోవటం చేతా ....రాజ్యం కలవరింతల సంగతి బావమరిది కి ఆల్రెడీ తెలియడం చేతా ...తనూ ఎటువంటి అభ్యంతరం లేకుండా వెళ్ళిరమ్మన్నాడు. రెండు రోజులూ ఒక రేంజులో నిద్ర పోయాడు రాంబాబు. మూడో రోజు ఉదయం ఆఫీసుకి రెడీ అవుతుండగా మోగింది సెల్ ఫొను....డిస్ప్లే మీద బావమరిది పేరు చూడగానే విషయం అర్దమయిపోయింది రాంబాబుకి..ఫొన్ ఎత్తి హలో అన్నాడు నీర్సంగా ......
బావగారూ మా అత్తగార్కి చాలా సీరియస్గా ఉంది ...మీ వూరు తీసుకొస్తున్నాం...ఇంకొ 3 గంటల్లొ అక్కడుంటాం......ఈలోగా ఏ హాస్పటల్ బాగుంటుందో చూడండి....మిగతా విషయాలు వచ్చాక మాట్లాడతాను......రెండు ముక్కల్లో చెప్పి ఫొన్ పెట్టేసాడు. సో నేను అనుకున్నట్టు రాజ్యం ఏమీ హడావిడి చెయ్యలేదన్నమాట ...హమ్మయ్య నిట్టూర్చాడు రాంబాబు.

బావమరిది అందర్నీ తీస్కుని వచ్చేసరికి 12 అయ్యింది. అందరూ ముభావంగా ఉన్నారు...రాజ్యం బాబి గాడి తో సహా. కంగారు పడవలసిన అవసరంలేదు అని డాక్టరు అనగానే అప్పటిదాకా అటెన్షన్ పొజిషన్లొ ఉన్నవాల్లంతా రిలాక్స్ అయిపోయి తలో బెంచీమీదా కూలబడ్డారు. నెమ్మదిగా రాజ్యం దగ్గరకి వెళ్ళి అసలేమయ్యింది? అడిగాడు రాంబాబు. మౌనం గా తమ్ముడి వైపు చూసింది....రాంబాబు ఓపిగ్గా బావమరిది దగ్గరికి వెళ్ళాడు,
ఏమీ అదక్కుండానే ...'ఆ ఏంలేదండీ తెల్లవారుజామున పెద్దగా కేకలు వేస్తూ ఆ తర్వాత మాట లేకుండా పడిపోయిందీ. చెప్పాడు రాంబాబు బావమరిది.
ఎందుకో రాజ్యం మీద డౌట్ వచ్చింది రాంబాబుకి, కాని అదే నిజమయితే ఎవరో ఒకళ్ళు ఈపాటి చెప్పేవారు కదా అనుకున్నాడు. రాజ్యం వంట చేసుకొస్తానని ఇంటికి వెల్లిపొయింది.
బాబి గాదిని వళ్ళో కూచూపెట్టుకుని ఏరా నాన్న ఏం చేసావ్ అమ్మమ్మా వాళ్ళ ఇంట్లొ ఈ మూడు రోజులూ...ముద్దుచేస్తూ అడిగాడు కొడుకుని రాంబాబు.
'మలేమో శీను బావ బొమ్మలు కొన్నాలు.....అమ్మమ్మ జంతికలు చేచిందీ ......'
'సీను బావ చినిమా చీడీలు తెచ్చాలు....అందలం కల్చి చంద్రముఖి చినిమా కూలా చూచాం'
గుండె గుభేల్మంది రాంబాబుకి... 'చంద్రముఖి చినిమా ఎప్పులు చూచారు ' కొడుకు లాంగ్వెజ్ లొనే అడిగాదు రాంబాబు. నిన్న లాతిరి.....ముద్దుగా చెప్పాడు బాబి.
మొత్తం విషయం అర్దమయ్యిపొయింది రాంబాబుకి... కొద్దిసేపు గాల్లో పిచ్చి చూపులు చూస్తూ కూర్చున్నాడు. అక్కడున్న వాళ్ళందర్నీ చూస్తె జాలేసింది...ఎందుకో అందరూ అప్పుడప్పుడూ తనవైపు జాలిగా చూస్తున్నట్టుకూదా అనిపించింది రాంబాబు కి.
***************************************
ఆఫీసుకి టైం అవుతూంది లేవండీ ....రాజ్యం కేకతో మెలుకువవచ్చింది రాంబాబుకి.
అరగంటలో రెడీ అయ్యి ఆఫీస్కి వెళ్ళి తన కూర్చీలో కూలబడ్డాడు...రాజ్యం సమస్యతో ఆఫీస్లొ పని కూడా చెయ్యబుద్దికావడంలేదు. కెంటీన్ కి వెళ్ళి టీ తాగుతూఉంటె ....హాయ్ అంటూ వచ్చాదు ఆడిటరు గోపాలం. ఏంటి విషయం అని కదిలించేసరికి మొత్తం కద చెప్పి గొల్లుమన్నాడు రాంబాబు. ఓస్ ఇంతేనా ఈమాత్రందానికే ఇంతిలాగైపోవాలా....రాజమండ్రి పక్కన సీతానగరం లొ ఒక ఆశ్రమం ఉంది...ఇలాంటి కేసులకి ఫేమస్ ....అక్కద చూపించు తగ్గకపొతే నన్నడుగు అన్నాడు.

ఏందుకో గోపాలం మాటల మీద గురి కుదిరింది రాంబాబుకి. ట్రీట్మెంట్ అంటె బాదపడుతుందని సరదాగ పాపికొండలు ట్రిప్ అని అబద్దమాడి రాజ్యాన్ని తీసుకుని బయలుదెరాడు రాంబాబు. వాల్వో బస్సు బయలుదేరటానికి రెడీగా ఉంది. బస్సెక్కి సీట్లొ రాజ్యాన్ని కూర్చోమని తను కిందకి దిగాడు. ఎందుకయినా మంచిదని డ్రైవర్ దగ్గరికి వెల్లి ఈ బస్సులో సినిమాలు వేస్తారా అని అడిగాడు మొహమాటపడుతూ.
పొకిరి ఒక్కటే ఉంది సార్ ఎవరైన ఎయ్యమంటె వేస్తాం లేదంటే అదీ లేదు అన్నాడు క్లీనరు.
మనసులో భయంగానే ఉన్నా మాములుగానె ఉన్నట్టు.....వచ్చి భార్య పక్కన కూర్చున్నాడు.
బాస్సు కదిలిన అరగంటకి పొకిరి సినిమా స్టార్ట్ అయ్యింది. రాంబాబుకి బీపీ స్టార్ట్ అయ్యింది.
తలతిప్పి రాజ్యం వంక చూసాడు, ఏదో అర్ధమయ్యినట్టు పక్కకి తిరిగి కళ్ళుమూసుకుని పడుకుంది రాజ్యం.
సినిమా సగం అయ్యింది, రాజ్యం నిద్రపోతూఉంది. బోజనాలకి బస్సు ఆపాడు........15 నిమిషాల తర్వాత బస్సు కదిలింది. పోకిరి సినిమా వెయ్యకుందా ఓన్లీ వీడియో పాటలు పెట్టాడు క్లీనరు. చాలా ఆనందపడ్డాడు రాంబాబు.

మెల్లగా నిద్రలోకి జారుకున్నాడు రాంబాబు.

'హలో సార్, మిమ్మల్నే సార్ '.... ఎవరో లేపుతున్నట్టు అనిపించి ఉలిక్కిపడి లేచాదు రాంబాబు.
ఏంటి అప్పుడే రాజమండ్రి వచ్చెసి.........అడుగుతూ ఎదో పాట పక్కనించి వినిపించేసర్కి తలతిప్పి రాజ్యం వంక చూసాడు.
'ఆహా... నా మాటె వింటారా'
'ఆహా ...నేనడింగిందిస్తారా'
'ఇప్పటికింకా నా వయసు.........' గాఢ నిద్రలో గట్టిగా పాదూతూఉంది రాజ్యం.

క్లీనర్ తనని ఎందుకు లేపాదొ అర్దమయ్యింది......రాత్రి బోజనల్లయ్యాకా రాజ్యం పదుకుందొ లేదో చూడకుండా నిద్రపోవటం తప్పయిపోయింది...... భగవంతుడా ....వెర్రివాడిలాగ గట్టిగా అరిచాడు రాంబాబు, భర్త కేకతొ ఉలిక్కిపడి లేచిన రాజ్యం ఏంటండీ ఏమైనా పీడకల వచ్చిందా ...అని అడగాబొయి నాలిక్కరుచుకుని పక్కకి తిరిగి కళ్ళు మూసుకుని పడుకుంది.

రాజమండ్రిలో హొటల్ రూం తీసుకుని ఫ్రెష్ అయ్యి........సీతానగరం వెళ్ళే బస్సు ఎక్కారు రాంబాబు రాజ్యం.పాపికొండలని సీతానగరం వెల్తున్నామేమిటీ ....అడగబోయి భర్త అసలే కోపంగా ఉన్నాడని ఊరుకుంది రాజ్యం. బస్సుకు ఇంజను,సీట్లు,టాపు తప్పితే ఏమీ లేవు .....పచ్చని పంట పొలాల మద్య బస్సు పొతుంటె చాలా హాయిగా ఉంది రాంబాబు మనసు.
ఆశ్రమం చాలా ప్రసాంతం గా ఉంది. రాజ్యాన్ని బయటే ఉండమని చెప్పి తను వెళ్ళి గురువుగారిని కలవాలి అని చెప్పాడు తలుపు దగ్గర కూర్చున్న అతనితో. 2 నిమిషాల తర్వాత పర్మిషన్ వచ్చింది.
లోపల గురువుగారు మటం వేసుకుని కూర్చున్నారు, ముందుగా ఒక నమస్కారం పెట్టి తర్వాత తన బాదంతా మొరపెట్టుకున్నాడు రాంబాబు.
గురువుగారు రెండు నిమిషాలు కళ్ళుమూసుకుని గట్టిగా శ్వాశ పీలిచి.... అయితే నీ భార్యకి నిద్దట్లో మాట్లాడే జబ్బుందన్నమాట అన్నారు....చిర్రెత్తుకొచ్చింది రాంబాబుకి,చెప్పినదంతావిని మళ్ళె తానేదొ కొత్తగా కనిపెట్టినట్టు చెపుతాడేమిట్రా అనుకుంటూ..అవును స్వామీ అన్నాడు వినయంగా.
మళ్ళీ 2 నిమిషాలు గేప్ ఇచ్చి ..'అందులోనూ కేవలం సినిమా పాటలు టీవీ వార్తలు అన్నమాట...' అన్నారు గురువుగారు. వళ్ళు మండిపోయింది రాంబాబుకి ....అయినా తమాయించుకుని కరెక్టు స్వామీ అన్నాడు.

మళ్ళీ 2 నిమిషాలు గేప్.........ఈసారి నీ భార్య పేరు రాజ్యం అన్నమాట అంటాడేమో..............భయం వేసింది రాంబాబు కి. కళ్ళు తెరిచి దగ్గరికి రమ్మన్నట్టు చూసారు, వెళ్ళాడు రాంబాబు.
నేను నీకొక మంత్రం చెపుతాను .....రోజూ రాత్రి పదుకోపొయేముందు నీ భార్య చెవిలొ 2 సార్లు చెప్పు, సరిగ్గా 10 రోజుల్లో తగ్గిపోతుంది చెప్పారు గురువుగారు. ఆనందంతో డాన్సు చెయ్యాలనిపించింది రాంబాబు కి అయినా అనుమానం గా.....'నిజంగానా స్వామీ' అన్నాడు.
'నిజంగానా అంటే .....ఏమిటి నీ ఉద్దేస్యం' అన్నట్టు చూసారు గురువుగారు రాంబాబు వంక, టక్కున తల వంచుకున్నాడు రాంబాబు.
'కర్మ కర్మే కర్మా కర్మె కరామా కర్మే..............' మంత్రోపదేశం చేసాడు రాంబాబుకి.
ఇదేదో కర్మ శబ్దం లాగా ఉందేమిటి స్వామీ ....నోరుజారేడు రాంబాబు. ట్యూన్ ఒకేలాగా ఉండడంతొ పొరపాటుపడ్డావ్ ఇది చాలా పవర్ఫుల్ మంత్రం....నీ భార్యకి తప్పకుండా నయమవుతుంది....వెళ్ళిరా దీవించారు గురువుగారు.

భక్తితొ వెయ్యినూటపదహార్లు చదివించుకుని బయటపడ్డాడు రాంబాబు.

ఇక్కడకెందుకొచ్చామండీ......ఉండబట్టలేక అడిగేసింది రాజ్యం. నాకు ఈమద్య మనసు బాగుండటంలేదు కదా దానికి ఈ ఆశ్రమం లో స్వామీజీ ఏమైనా సొల్యుషన్ చెప్తారేమో అని ............చెప్పారా.........ఆత్రుతగా అదిగింది రాజ్యం.చెప్పారు....అది చాలా పవుర్ఫుల్ మంత్రం....నీకు కూడా చెప్పమన్నారు, మేటర్ బాగా డీల్ చెస్తున్నందుకు మనసులోనే శేభాష్ రా రాంబాబు అనుకున్నాడు.
ఆఫీసులో అర్జెంటుగా ఏదో పని తగిలింది అని మరో అబద్దమాడి....తిరుగు ప్రయాణానికి సేఫ్ సైడుగా రైలు టిక్కెట్లు తీసుకున్నాడు .
ఇంటికెళ్ళిన మొదటి రోజు రాత్రి ప్రేమగా రాజ్యాన్ని దగ్గరకు పిల్చి ఇప్పుడు నేను నీకో విషయం చెప్తాను...కళ్ళు మూసుకో అన్నాడు రాంబాబు.
'చీ మీరు మరీనూ ...బాబి గాడు ఇంకా నిద్దరోలేదు..' అంది సిగ్గు పడుతూ రాజ్యం.
జుత్తు పీక్కున్నాడు రాంబాబు, నీ బొంద.... అదికాదు విషయం ....గురువుగారు చెప్పిన మంత్రం చెప్తాను కళ్ళు మూసుకో చెపాడు రాంబాబు.
'కర్మ కర్మే కర్మా కర్మె కరామా కర్మే..............' కంగారు పడింది రాజ్యం, ఇదేమి మంత్రమండీ .....సంస్క్రతం లో తిట్టినట్టు.
మంత్రాలు ఇలాగే ఉంటాయి....మనకి అర్దమవ్వవు...నువ్వు కళ్ళు మూసుకుని ఈ మంత్రాన్ని 10 సార్లు మనసులోనే చదువుకుని పడుకో ...చెప్పాదు రాంబాబు.
**********************************
రోజులు గడుస్తున్నాయి ...మంత్రాన్ని రాత్రులే కాకుండా పగలు కూడా ఎప్పుడు పడితే అప్పుడు రాజ్యానికి నూరిపోస్తున్నాడు రాంబాబు. వీలున్నప్పుడల్లా ఆఫీసులోంచే ఫోను చేసి మరీ మంత్రం చెప్తున్నాదు రాజ్యానికి.
నిజంగా మంత్రం మహిమో ... లేక రాజ్యం బుర్రలో మంత్రం గోల తప్ప మరేమీ ఎక్కనీకుండా రాంబాబు చేసిన పకడ్బందీ ఏర్పాట్లో .....మొత్తానికి రాజ్యం నిద్దట్లో పాటలు పాడటం, సినిమా డైలాగులు చెప్పడం...వార్తలు చదవటం మర్చిపోయింది.
రాంబాబు రాత్రిళ్ళు ప్రసాంతంగా నిద్రపోగల్గుతున్నాడు...అయినా రాజ్యానికి మంత్రం నూరిపోయడం మాత్రం మానలేదు. ****************************************
మానేజర్ లేకపోవడంతో....లంచ్ అయ్యాకా కూర్చీలోనే ఒక కునుకు తీసాడు రాంబాబు. 'సార్ సార్....'లేచి ఏంటన్నట్టు చూసాడు అటెండర్ వంక..ఆఫీసులో అందరూ తనవంకే అయోమయంగా చూస్తుండడంతో ...ఏమయ్యింది అని గట్టిగా అడిగాడు రాంబాబు అటెండర్ని .
'మీరు నిద్రలో ...ఏదో కలవరింతలు పలుకుతున్నారు సార్ ' చెప్పాడు అటెండరు.
పిల్లల గురించో లేకపోతే దగ్గర వాళ్ళ గురించో బెంగ పెట్టుకుని నిద్ద్దర్లో కలవరిస్తారు ....అది కూదా ఒక ముక్క...లేక పొతే ఒక లైను. నువ్వేంటయ్యా రాంబాబూ నిద్రలో కర్మ, కర్మ అంటూ పద్యాలు పాడుతున్నావ్....' వెక్కిరింపుగా అంది టైపిస్టు సరోజ.
'పరిస్తితి అర్దమయ్యింది రాంబాబుకి...'
అంటే రాజ్యం జబ్బు నాకు ట్రాన్స్ఫర్ అయ్యిందన్నమాట....కుప్పకూలిపోయాదు రాంబాబు కూర్చీలోనే. ....

3 comments:

Unknown said...

కొత్త బ్లగా నేనిప్పుడే చూడటం. కామెడి అదిరింది. కూడలిలో మీ బ్లాగు కనపడలేదే :-(. కుదిరితే WORD VERIFICATION తీసెయ్యండి. తీసెయ్యటానికి ఇది చూడండి
http://tolichiniku.blogspot.com/2008/09/word-verification.html

Anonymous said...

చక్కగా రాసారు...బాగా నవ్వించారు.

--రమ

Madhu said...

భలే రాసారు.