'విధి బలీయమైనది...', 'విధి ఆడిన వింత నాటకం...' ఇలాంటి డైలాగులు ఎప్పుడో పాత సినిమాల్లో విన్నానుకానీ ....అనుభవంలోకి రావటం...ఇదే ఫస్ట్ టైం. మే నెలలో అలాంటి అనుభవాలు చాల కలిగాయి ...అది ఏలాగంటే.........
'విధి బలీయమైనది...' = మా కంపెనీని ఎవడో కొనేసాడు.
'విధి ఆడిన వింత నాటకం...' = మా క్లైంట్ ని కూడా ఎవడో ఒక అప్ప్రాచ్యపు వెధవ కొనేసాడు.
'ఏం జరిగి ఉంటుందో ...ఈపాటికి మీకర్ధమై ఉండాలి....ఇంకా అర్ధం కాలేదా? .....ఐతే మళ్ళీ మొదటినుంచీ చదవండి :)
ఇహ చూసుకోండి .....నా సామి రంగా....ఆఫీసు లో కేబిన్లు,కేంటీన్లు,బాత్రూంలు...ఎక్కడ.. చూసినా ఒకటే చర్చలు, సమావేశాలు...ట్రైనీ ల నుంచి రేపో మాపో చచ్చి పోయేలా ఉండే ముసలి మేనేజర్ లు దాకా ప్రతీవోడు ఏదో వాడి సొంత ఇంటి స్థలాన్ని ఎవరో రాత్రికి రాత్రి కబ్జా చేసినట్టు బాధ పడిపోడం స్టార్ట్ చేసారు.
ఇంత.. హడావిడిలో ...'బయ్2 గెట్ 1' ఆఫర్ లా .. అనుకోకుండా నాకు ఇంకో సామెత ... అనుభవం లోకి వచేసింది...
'ములిగే నక్క మీద తాటిపండు పడినట్టు' = మా క్లైంట్ కంపెనీని ఎవడో కొనేయడం మూలానా....మా కంపెనీ ఇంకో పనికిమాలిన కంపెనీకి అమ్ముడుపోవడం చేతా...ముఖ్యం గా...'మద్రాస్ లో sharavana stores లాంటి ఇండియన్ కంపెనీ ఒకటి మా క్లైంట్ ని కొనేసిన వెధవని కల్సి ...అయ్యా మీ ప్రాజెక్ట్ మేము రూపాయి పావలా కే చేసేస్తాం అని ఆశ పెట్టడం వలనో '....మా టీం మొత్తాన్ని త్వరలోనే తన్నేసి... తర్మేయబోతున్నారని వార్త.
నమ్మండి....మా టీం పరిస్తితి ఎలా తయారయ్యిందంటే..' ఎవడో డిప్ప మీద కొట్టాడని కోపంగా వెనక్కితిర్గి చూసేలోపలె మళ్ళీ దవడ మీద లాగి కొడితే ..ఎలా ఉంటుంది ? ... అలా తయరయ్యిందన్న మాట...' . మరసటి రోజు నుచి...మా టీం లో ఎవడి మొహం చూసిన అదో రకమైన తెలీని ...అర్ధంకాని ...భావం. కొంతమందైతే ...నక్సలైటు ల్లాగా ....ముభావంగా...ఏదైనా పని తగిలి మాట్లాడితే ..కోపంగా..చూస్తూ..బయం పుట్టిచండం మొదలెట్టారు.
మరికొంతమది ...'పయనించే ఓ చిలుకా...ఎగిరి పో పాడైపోఎను గూడు ..' టైపు లో... కంపెనీ జంప్ చేసే ప్రయత్నాల్లో ఉన్నారు. ఇంకొంత మంది...'అటు కంపెనీ జంప్ చెయ్యరు...చేసే ప్రయత్నం కూడా చెయ్యరు గాని...ప్రజారాజ్యం పార్టీలో చేరేముందు TDP నాయకులు చేసే స్టేట్మెంట్స్ టైపు లో ....మేము ఫలాన కంపెనీ లో చేరబోతున్నామని ...ఆ కంపెనీ లోనే సామాజికన్యాయం జరుగుతుందని' కూతలు కుయ్యటం స్టార్ట్ చేసారు.
ఈలోగా...మా ఫ్లోర్ లో ఉండే...మిగతా ప్రాజెక్ట్స్ నుండి...జనాలు తండోప తండాలు గా ...మమ్మల్ని చూడ్డానికి..( పరామర్శ) రావటం మొదలెట్టారు..
' చూసావా వదిన...పాపం పెళ్ళయిన..రెండేళ్లకే పసుపు కుంకాలు తీసుపోయాడు ఆ భగవంతుడు ఈ ప్రాజెక్ట్ వాళ్ళకి...' అన్నట్టు...ఒకళ్ళ మొహాల్లో ఒకళ్ళు భావాలు పలికుంచుకుంటూ ...వాళ్ళేదో వాళ్ల ప్రాజెక్ట్ ని ..పెళ్లి చేసుకుని...అక్కడే సెటిల్ అయిపోయినట్టు...నలుగురైదుగురు పిల్లల్ని కన్నట్టు... ఫీలింగ్'
...నాకైతే...తిక్కరేగి పోయేది.....చెప్పలేదు కదూ నేను మా టీం కి పెత్తందారు...అర్ధం కాలే ? ప్రాజెక్ట్ లీడర్ని ...
ఫైన చెప్పిన సంఘటన వల్ల...' ఊరిలో పెళ్ళికి ...కుక్కల హడావిడి' అనే సామెత కూడా నాకు( మీకు కూడా ) తెలీకుండానే ...అనుభవం లోకి వచేసింది.
ఇది ఇలా ఉండగా..ఒకరోజు ...మా పనికిమాలినోడు (అదేనండీ PM ) ..వచ్చి పలకరింపుగా..పల్లికిలించాడు...
ఆ 'ఇకిలింపు' లో ....ఎన్ని అర్దాలు వెతుకోవచ్చనీ.....!!! మచ్చుకి కొన్ని...
'ఎంట్రా ఆడుకు దొబ్బుతున్నావా .......మరి పెండింగ్ పని ఎవడు చేస్తాడు బె'
'తింగరి వేషాలు వెయ్యకండి ....ఇంకా క్లైంట్ గాడు ఏమి క్లియర్గా చెప్పలేదురా..కుంకల్లారా.....'
....అర్ధమయ్యింది...ఇంక చాలు....ఆ.. ఇకిలించడం మానరా బాబూ..అని మనసులోనే అనుకుంటూ..
అత్తింటి వారి కోరికల్ని వెంటబెట్టుకుని పుట్టింటికి చేరిన.....కొత్త కోడల్లా...మా టీం దగ్గరికి వెళ్ళా...
ప్రకాష్....
ఏంటి...అన్నట్టు చూసాడు ...మా డెవలపర్ నా వైపు.
వీడి చూపులో కూడా ...చాలానే కనిపించాయి నాకు... మచ్చుకి..
'నేను ఇంకేపనీ చెయ్యను బె....నీ దిక్కున్నాకాడ చెప్పుకో పో'
'వీలుంటే...నువ్వు కూడా ఆ ప్రజారాజ్యం లో చేరు ( వేరే కంపెనీ) ...అంతే గాని నన్ను విసిగించకు..నేనసలే అంత మంచాన్డ్ని కాదు'
....వీడి తో డేంజర్ అని...రూట్ మార్చా...' ఐ జస్ట్ నీద్ యౌర్ హెల్ప్' ..ఇన్ కంప్లేటింగ్ ది రిలీజ్.... అన్నాను.
' హే కమ్మాన్ యా........ ఎవెర్య్థింగ్ ఇస్ ఓవర్ ...వై యు వాంట్ అల్ తేసే నౌ...?'
(తెలుగులో....ఒరేయ్ పిచ్చోడా..అంత అయ్యిపోయింది రా...ఇప్పుడెందుకు రా..ఇవన్నీ ?)
ఇంకా నయం ..నాలుగు అందుకోలేదు ...బ్రతికాం అనుకుని...ఇకమీదట...ఎవర్నీ...ప్రాజెక్ట్ విషయం మీద కదపకూడదని ఒట్టేసుకోవడం జరిగింది..
.. ఏంటో కర్మ...అటు మా క్లైంట్ ... మా కంపెనీ వాళ్లు బాగానే ఉన్నారు...ఇటు మా టీం కూడా...బాగానే ఉంది ... అందరూ కలిపి... నన్ను మాత్రం..ఏదో పాకిస్తాన్ ఉగ్రవాది లాగ చూస్తున్నారు .
'మొగుడు కొట్టినందుకు కాదు బాధ ....తోటికోడలు నవ్వి నందుకు ' అన్నట్టు తయారయ్యింది...నా పరిస్థితి. చూసారా...మరో సామెత అనుభవం :)
చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ ప్రకటన లాగ .....ఊరించీ...ఊరించీ....ఊరించీ....ఇహ జనాలందరు....ఛీ ఎధవగోల ...నాకెందుకులే అనుకునే టైం ...లో ...పార్టీ ఏర్పాటుని పబ్లిగ్గా ...అనౌన్స్ చేసినట్టు...మా క్లైంట్గాడు కూడా ....ఆ సుభవార్త...మా చెవిన వేసాడు... మీటింగ్ పెట్టి కాన్ఫరెన్స్ కాల్ లో .....
'సో ఫ...యు గ.. డి ....వేగుడి..జా..'
(సో ఫార్ యు గయ్స్ డిడ్ వేరి గుడ్ జాబ్')
'థాంక్స్ ఫ...ఆ..హ్హ...గా..'
(థాంక్స్ ఫర్ అల్ యౌవర్ హార్డ్ వర్క్ గయ్స్ ')
'.....................................'
వినేవాడు వింటున్నాడు.....వినడానికి ఇంట్రెస్ట్ లేని వాళ్లు..మా పెద్దోడు (PM) వంక...నా వంకా...సీరియస్ గా మొహం పెట్టి చూస్తున్నారు.
క్లైంట్ చెప్పేది...అర్ధంకాని వాళ్లు మాత్రం ....'పాకిస్తాన్ చేతిలో ఘోరంగా వోడిపోతున్న ఇండియా ' క్రికెట్ మాచ్ కామెంటరీ రేడియో లో వింటున్నట్టు...బాధగా..పెట్టారు..మొహాలు.
....హహ్...హ్చాహః...ఇక్కడ కూడా ఒక సామెత అనుభవం లోకి వచ్చేసింది...బట్ ఇది మాత్రం...నాకు ప్లస్ మా పెద్దోడికి కూడా .....
సామెత: 'ఒప్పుకున్నా... పెళ్ళికి వాయించక తప్పదు' ......
ఇహ మీటింగ్ చివర్లో జరిగిన...ఒక చిన్న ట్విస్ట్......
'మణిరత్నం రోజా సినిమాలో ....అరవిందస్వామి ...మధుబాల అక్కని చూడ్డానికి వచ్చి ...అక్క కాదు..మధుబాలే నచ్చింది..అన్నట్టు...' కచ్చితం గా అలాగే అనకపోయినా....ఇంచుమించుగా..ఆ టైపులోనే
మా క్లైంట్ గాడు....సడన్ గా...మీటింగ్ చివర్లో........
' సారీ తో మిస్సు యు అల్....బట్ యాస్ దిస్ కస్ద్ ఐ వాంట్ రిషి...అండ్ వాన్ మోర్...పర్సన్ to జాయిన్ ది టీం ఇన్ న్యూయార్క్....' అనేసర్కి ...అందరికి...చిన్న షాక్..నాతో సహా...
...............తర్వాత ఏం జరిగుంటుందో ....వెధవది మీకు నేను చెప్పాలా....తెర తీయకుండానే మనం ..అమెరికా గడ్డ మీద ఎడమ కాలు పెట్టేశాం...
'ఇక్కడ...కూడా....ఒక సామెత'...... ఇంకా అనుభవం లోకి రాలేదు...బట్...రాబోతుంది...
' ముందుంది.. ముసళ్ళ పండగ..' ......
Subscribe to:
Post Comments (Atom)
20 comments:
రిషి గారు...బాగా వ్రాసారు!
ఇరగదీసారు... keep writing..
అదరహో!! చక్కగా రాసారు. గొప్ప పోలికలు. "నచ్చకపోతే.." - మీ పరిచయంలోంచి ఈ ముక్క తీసెయ్యండి
చాలా చాలా బాగా రాశారూ
ఇంకో సామెత.
" తంతే గారెల బుట్టలో పడడమంటే ఇదే ననుకుంటా."
చేసుకున్న వారికి చేసుకున్నంత మహదేవా :)
బాగుంది.
Hi rishi - అరే వాహ్ ! భలే రాస్తున్నారే - తంతే బూర్లె గంప లొనే పడ్డారు ! ఇంకో సామెత గుర్తు రావట్లేదు.
అల్గారిథం రాసినట్టు రాసారే పోస్టు... Keep going
ఈవాక్యం బాగుంది ,ఇది మెంక్షన్ చేద్దాం కామెంట్లో అనుకుంటూ టపా పూర్తిచేసేసరికి మొత్తం టపా మెంక్షన్ చెసేపరిస్థితి వచ్చిని.అందుకే ఇది బాగుంది అని చెప్పలేక ...... .. super :)
:)) చాలా బావుంది..
హహహ.... మాష్టారూ కేక!
బాగుంది
చాలా బాగుంది. పోలికలు భలే చెప్పారు. ఇంచుమించు ఇప్పటి నా కథే, కాకపోతే ఇంకా క్లైమాక్స్ రాలేదు నాకు.
బాగా రాస్తున్నారు.
బాగుంది.
చంపేసారు మీపోలికల్తో......
నవ్వి..నవ్వి..కళ్ళల్లొ నీళ్ళు తిరుగుతున్నాయ్.
' చూసావా వదిన...పాపం పెళ్ళయిన..రెండేళ్లకే పసుపు కుంకాలు తీసుపోయాడు ఆ భగవంతుడు ఈ ప్రాజెక్ట్ వాళ్ళకి...'
ఈ లైన్ సూపర్.
మీ రైటింగ్ స్టయ్ల్ చాలా బాగుంది...keep writing
-rama
హహహ.....మీ ప్రాజెక్ట్ కష్టాలని కామెడీ గా మార్చి కుమ్మిపడేసారు.
బ్రహ్మాండంగా రాస్తున్నారు...keep going.
రిషి గారు...చాలా చాలా బాగా వ్రాసారు! :))
చెగోడీలేమో కాని చెడుగుడాడేస్తున్నారు బాస్ మీ టపాలతో... కేక...
హహహ చాలా బాగుంది.
..నచ్చకపోతే తిట్టుకోకండి ప్లీస్...
నాకు నచ్చిదండి. తిట్టుకోవచ్చా? నచ్చిందంటే అలా ఇలా కాదు, ఒక్కణ్ణే ఇంట్లో వున్నా పగలబడి నవ్వాను. ముఖ్యంగా - ఎవడో డిప్ప మీద కొట్టాడని కోపంగా వెనక్కితిర్గి చూసేలోపలే - అన్న మాటకు. దారుణంగా నచ్చింది. తిట్టుకోవచ్చా? :-))
Post a Comment